కొచ్చి ఎయిర్‌పోర్టు మూసివేత

కొచ్చి ఎయిర్‌పోర్టు మూసివేత

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెరియార్ నదిపై ఉన్న ఆనకట్టలో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కారణంగా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. రన్ వే పై వరదనీరు చేరడంతో ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం మధ్యహ్నం మూడు గంటల వరకు ఎయిర్ పోర్టులో సేవలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కొజిక్కోడ్ తదితర జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలతో కేరళ సీఎం పినరయి విజయన్ విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో సమీక్ష చేశారు. ఎయిర్ పోర్టు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.