వచ్చేవారం ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతుంది: ఐఎండీ

వచ్చేవారం ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతుంది: ఐఎండీ

దేశ రాజధాని ఢిల్లీ చలితో గజ..గజ వణికిపోతోంది. చలిగాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. వచ్చే వారం రోజులు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు సెల్సియస్ కంటే తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈనెల 16 నుంచి 18 మధ్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు  సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించింది.  చలి తీవ్రతను తట్టుకునేందుకు విటమిన్ సీ అధికంగా ఉండే పండ్లు,కూరగాయాలు తినాలని తెలిపింది. 

ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాజస్థాన్, గుజరాత్ లలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని తెలిపింది. వాచ్చే వారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.