పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు : పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో  పీఎంశ్రీ కింద ఎంపికైన 21 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పీఎంశ్రీ నిధులు మంజూరైనట్లు తెలిపారు. 

2023-–-24, 2024-–-25 వరకు రూ.13.26 కోట్లు మంజూరైతే ఇప్పటివరకు కేవలం రూ.7 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. మిగతా నిధులను వచ్చే మార్చిలోపు ఖర్చు చేయాలని ఆదేశించారు. అదనపు గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, సైన్స్ ల్యాబ్, భవిత సెంటర్ల ఏర్పాటకు నిధులు ఖర్చు చేయాలని తెలిపారు. సమావేశంలో  డీఈవో అబ్దుల్ ఘని, టీజీ ఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామచందర్, ఏఈలు, హెచ్​ఎంలు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. 

ధాన్యం డబ్బులను వెంటనే జమ చేయాలి..

పెద్దమందడి, వెలుగు : ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామం చేనేత కార్మికుల కాలనీలో ధాన్యం కొనుగోలు కేంద్రం, మోజర్ల గ్రామంలోని వారాహి రైస్ మిల్లును కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ తేమ, తాలు చూసుకొని వెంటనే ధాన్యం తూకం వేయాలన్నారు.