నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రైతులకు ఇబ్బంది కలగకుండా వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం తాడూరు మండలం ఐతోలు గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు.
కలెక్టర్‌ను కలిసి ఎన్నికల పరిశీలకులు
పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా రాజ్యలక్ష్మి, వ్యయ పరిశీలకులుగా భీమ్లా నాయక్ ను జిల్లాకు కేటాయించారు. వారు కలెక్టర్ బదావత్ సంతోష్‌ను కలిశారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని వారు సూచించారు. జిల్లాలో ఎస్ఎస్టీ, వీఎస్టీ టీమ్స్ పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో 404 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్, వీడియో చిత్రీకరణ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, డీపీవో శ్రీరాములు, అబ్జర్వర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు.
