నాగర్కర్నూల్ను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్కర్నూల్ను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్​కర్నూల్​ను మోడల్  జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బదావత్  సంతోష్  ఆదేశించారు. బుధవారం జిల్లా వ్యవసాయ, మత్స్యశాఖ, ఇరిగేషన్, హార్టికల్చర్, అగ్రికల్చర్, మార్కెటింగ్, నీటి పారుదల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ధన్, ధాన్య కృషి యోజన పథకం కింద జిల్లా ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాను రాష్ట్రం, దేశంలో మోడల్  జిల్లాగా నిలపాలని కోరారు. 

ఈ పథకం కింద రైతుల ఆదాయాన్ని పెంచడం, ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు చేపట్టడం, నీటి వనరుల సమర్థ వినియోగం, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి శాఖ సమన్వయంతో యాక్షన్ ప్లాన్  సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 11న ప్రధాన మంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాట్లు చేయాలని సూచించారు.