ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బంది పడొద్దు : కలెక్టర్ హనుమంతరావు

ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బంది పడొద్దు : కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. తుర్కపల్లి మండలం పల్లెపహాడ్  పల్లె దవాఖానను బుధవారం తనిఖీ చేశారు. చిన్న పిల్లలకు రెగ్యులర్ గా వ్యాక్సిన్ వేస్తున్నారా అని తెలుసుకున్నారు. పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించారు.   

రుస్తాపూర్ హైస్కూల్​తనిఖీ 

రుస్తాపూర్ హైస్కూల్​ను కలెక్టర్  తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో బడిబాట కార్యక్రమం చేపట్టి, అడ్మిషన్లు తీసుకోవాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పారు. ఈ ఏడాది కూడా పదోతరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.

ఇండ్ల పనులు వేగవంతం చేయాలి 

యాదాద్రి వెలుగు:  ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఆలేరు మండలం టంగుటూరులో ఇండ్ల పనులు పరిశీలించారు.  ఇండ్లకు సంబంధించిన మెటీరియల్ ను తక్కువ ధరకు ఇవ్వాలని ప్రతీ మండలంలో ఒక కమిటీ వేశామని, సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.