
యాదాద్రి, వెలుగు : 'సన్న బియ్యం బువ్వ మంచిగుందా.. రుచికరంగా ఉంటుందా..?' అని స్టూడెంట్స్ను యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు అడిగారు. ఆలేరు మండలం కొలనుపాకలోని హైస్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కిచెన్‌లోకి వెళ్లి వంట సరుకులను పరిశీలించారు. తాజా కూరగాయలు, సరుకులతో వంట చేయాలని సూచించారు. స్టూడెంట్స్‌కు వడ్డించారు. వంట చేయడానికి షెడ్ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. అనంతరం మంతపురిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపనులను ఆయన పరిశీలించారు.
త్వరగతిన పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. సిమెంట్, స్టీల్, ఇటుక రేట్లు పెంచకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో తహసీల్దార్లను ఆయన ఆదేశించారు. చేయూత పింఛన్ల అమలులో పారదర్శకత పాటించాలని ఆఫీసర్లకు సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ –2025, వనమహోత్సవం కార్యక్రమాలపై వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, డీఆర్డీవో నాగిరెడ్డి పాల్గొన్నారు.