సమ్మక్కా.. ఆరోగ్యం ఎలా ఉంది..? .. ఆరా తీసిన జిల్లా కలెక్టర్

సమ్మక్కా.. ఆరోగ్యం ఎలా ఉంది..? .. ఆరా తీసిన జిల్లా కలెక్టర్

యాదాద్రి, వెలుగు : 'సమ్కక్కా.. ఆరోగ్యం ఎలా ఉంది..? టైముకు తింటూ గోలీలు వేసుకుంటున్నవా..? పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు' అని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం మోత్కూరులోని గర్భిణి గంధం సమక్క ఇంటికి కలెక్టర్ వెళ్లి న్యూట్రిషన్​ కిట్​అందించారు. ఆమె ఆరోగ్యంపై ఆరా తీసి ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ​హాస్పిటల్​కు వెళ్లి డబ్బు ఖర్చు చేసుకోవద్దని, గవర్నమెంట్​ హాస్పిటల్​కు వెళ్లాలని సూచించారు. 

కనీసం వారానికి రెండుమార్లు పప్పుతో కలిసి ఆకు కూరలు తీసుకోవాలని సూచించారు. పల్లీలు బెల్లంతో కలిపి, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలన్నారు. డాక్టర్ సూచన మేరకు ఐరన్ ట్యాబ్లెట్స్ లేదా ఇంజక్షన్ రూపంలో తీసుకోవడం మంచిదన్నారు. అనంతరం మోత్కూరు పీహెచ్​సీని సందర్శించి ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి, త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.