బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టాలి : కలెక్టర్ హరిచందన

బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టాలి : కలెక్టర్ హరిచందన

నల్గొండ అర్బన్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టాలని కలెక్టర్ హరిచందన బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌లో ఎస్పీ చందనా దీప్తితో కలిసి జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ఎన్నికల సందర్భంగా పార్టీలు నగదు, ఆభరణాలు, వస్తువులను పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.

 ప్రత్యేకించి బ్యాంకుల ద్వారా నిర్వహించే అనుమానాస్పద లావదేవీలపై వెంటనే గ్రీవెన్స్‌‌‌‌ కమిటీకి సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు.  ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌, ఎక్సైజ్, ఇన్‌‌‌‌కం టాక్స్, జీఎస్టీ శాఖలు పకడ్బందీగా పనిచేయాలన్నారు.  ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలతో పాటు, గూగుల్ పే, ఫోన్ పే నుంచి ఎక్కువ మొత్తం  ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయితే అకౌంట్ల వివరాలు ఇవ్వాలన్నారు.    

నగదు, మద్యం వంటివి పంపిణీ చేస్తున్నప్పుడు ఎఫ్ఎస్‌‌‌‌టీ, ఎస్ఎస్ టీ, వీఎస్‌‌‌‌టీ బృందాలకు ఫోన్ కాల్  వస్తే వెంటనే స్పందించాలని కోరారు.  అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు శ్రీనివాస్,  పూర్ణచందర్,  అడిషనల్‌‌‌‌ ఎస్పీ రాములు నాయక్, జడ్పీ డీఈవో, జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ నోడల్  అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి పాల్గొన్నారు.