జమున హ్యచరీస్ లో అసైన్డ్ భూములు

జమున హ్యచరీస్ లో అసైన్డ్ భూములు

జమున హ్యచరీస్ లో అనుమతులు లేకుండా పెద్ద పెద్ద నిర్మాణాలు జరిగాయన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్. కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చిందన్నారు. జమున హ్యచరీస్ లో  అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు. ప్రలోభ పెట్టి భూములు తీసుకున్నారన్నారు. భూములు దౌర్జన్యంగా తీసుకున్న విషయాన్ని ప్రభుత్వానికి తెలిపామన్నారు.సర్వే నెంబర్ 130,81లో సీలింగ్, అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు. భూముల్లో ఎస్సీ, ముదిరాజ్ సహా వంజర కమ్యూనిటీలకు చెందిన వారి భూములు ఉన్నాయన్నారు. పౌల్ట్రీ ఫామ్ కు పీసీఓ అనుమతి లేదన్నారు కలెక్టర్. సర్వే నెంబర్ 130లో 3 ఎకరాల అసైన్డ్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారన్నారు. 56 మందికి చెందిన 76 ఎకరాల 30  గుంటల భూములను లాక్కున్నారన్నారు. అసైన్డ్ భూముల విషయంలో ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని.. అవి రిజిస్ట్రేషన్ కావని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్ లు నిర్మించారన్నారు కలెక్టర్ హరీశ్. హల్దీ వాగు దగ్గర 97 సర్వే నంబర్ లో పాల్ట్రీకి  సంబంధించిన  నిర్మాణాలున్నాయి. భూమి హక్కుదారులు తమ భూమి తమకు కావాలని కోరారని .. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పామన్నారు.