పెండింగ్​ పనులు త్వరగా పూర్తిచేయాలి : ఇలా త్రిపాఠి

పెండింగ్​ పనులు త్వరగా పూర్తిచేయాలి : ఇలా త్రిపాఠి
  • కలెక్టర్​ ఇలా త్రిపాఠి

మిర్యాలగూడ, వెలుగు : నియోజకవర్గంలోని పెండింగ్​పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.  శనివారం మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న ఫ్లై ఓవర్ పనులు, సమీకృత మార్కెట్ స్థలాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్​తో  కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని అభివృద్ధి పనులు కంప్లీట్ చేస్తామన్నారు.

ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు వెడల్పు పనులను పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇక్కడ మున్సిపాలిటీలో చోటు చేసుకున్న అవినీతిపై అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేస్తామని తెలిపారు. అనంతరం నెల్లికల్లు, దున్నపోతుల గండి, ఇతర లిఫ్టులు, ఇతర అంశాలపై ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఇరిగేషన్ ఎస్ఈ మల్లికార్జున్, ఈఈ కరుణాకర్, డీఈ కేశవ్, మున్సిపల్ కమిషనర్ యూసూఫ్ పాల్గొన్నారు.