పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలి .. తోగ్గూడెం మిషన్ భగీరథ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేశ్

పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలి .. తోగ్గూడెం మిషన్ భగీరథ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేశ్

పాల్వంచ, వెలుగు : వర్షాకాలంలో నేపథ్యంలో నీటి శుద్ధి పరీక్షలు నిర్వ హించి పరిశుభ్రమైన నీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ వీ పాటిల్​ అధికారులను ఆదేశించారు. పాల్వంచ మండలం తోగ్గూడెంలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్​మెంట్ ప్లాంట్ ను కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్ బుధవారం పరిశీలించారు. ప్లాంట్ లో నీటిలో సామర్థ్యం, రోజువారీ డిమాండ్, గ్రామాల వారీగా నీటి సరఫరా గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. 

కేంద్రానికి విద్యుత్ సమస్య తలెత్తకుండా సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.  వాటర్ ఫిల్టర్ బెడ్ భవనం పైన సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వా రా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్​ వెంట మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ నళిని, డీఈ సాయి, ఏఈ వెంకటేశ్​తహసీల్దార్ ప్రసాద్ ఉన్నారు. 

పీహెచ్​సీ తనిఖీ 

పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలో ఉన్న జగన్నాథపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.