
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్వి.పాటిల్ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్నిర్వహించారు. వ్యాధులు వ్యాప్తి చెందనున్న దృష్ట్యా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. నీరు నిల్వ ఉండొద్దని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. జూన్3 నుంచి 13వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.