పెద్దవాగు బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్

పెద్దవాగు బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్

కరకగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పెద్దవాగు బ్రిడ్జిని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్ ఆదివారం పరిశీలించారు. గతేడాది వర్షాలకు పెద్దవాగు బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు కోతకు గురికావడంతో ఈసారి రాకపోకలకు అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. మండలంలో దెబ్బతిన్న అంతర్గత రోడ్లకు రిపేర్లు చేయించాలని ఆదేశించారు.

మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్​ నిర్మించాలని  తహసీల్దార్​  నాగప్రసాద్  కోరగా స్వచ్ఛ భారత్  నిధుల​ద్వారా నిర్మిస్తామని చెప్పారు. కలెక్టర్​ వెంట కరకగూడెం తహసీల్దార్ నాగప్రసాద్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.