అభివృద్ధి పనులు త్వరగా పూర్తవ్వాలి : కలెక్టర్ కుమార్ దీపక్

అభివృద్ధి పనులు త్వరగా పూర్తవ్వాలి : కలెక్టర్ కుమార్ దీపక్

కోల్​బెల్ట్, వెలుగు: మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​ కుమార్​ దీపక్​ ఆదేశించారు. శుక్రవారం క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో ఆయన  పర్యటించారు. మున్సిపల్​ కమిషనర్లు రాజు, రాజలింగుతో కలిసి ఇదివరకు చేపట్టిన అభివృద్ది పనులు, డ్రింకింగ్ ​వాటర్  ​సప్లై కోసం మంజూరైన అమృత్ 2.0 స్కీం పనుల పురోగతిని పరిశీలించారు. 

శానిటేషన్, నర్సరీల నిర్వహణ, గతంలో కేటాయించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల వద్ద మౌలిక వసతులపై ఆరా తీశారు. వార్డుల్లో ప్రతీరోజు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్​యార్డులకు తరలించాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్​ఆఫీస్​లలో రిజస్టర్లు, రికార్డులను తనిఖీ చేశారు. 

యూనియన్ ​బ్యాంక్​ ప్రారంభం​

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి గద్దెరాగడిలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్​ను కలెక్టర్​కుమార్​దీపక్ శుక్రవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ రాధాకృష్ణతో కలిసి ప్రారంభించారు. లీడ్ డిస్ట్రిక్ట్​మేనేజర్ తిరుపతి, బ్యాంకు మేనేజర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.