విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ హైస్కూల్​ను గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. కొత్తగా నిర్మిస్తున్న స్కూల్ ​భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. స్టూడెంట్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. టాయిలెట్స్, క్లాస్​ రూమ్స్, కిచెన్​ను పరిశీలించారు. 

ప్రతి టెన్త్​ విద్యార్థి పాస్​అయ్యేలా టీచర్లు కృషి చేయాలన్నారు. సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందించాలన్నారు. స్టూడెంట్లతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్​వెంట తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు.

పనులు నాణ్యతతో చేపట్టాలి

చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలం కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ ​దీపక్ గురువారం పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. ఆశ్రమ బాయ్స్ స్కూల్, వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 

విద్యుత్, టాయ్​లెట్స్, కిచెన్ ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ ​వెంట మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తదితరులున్నారు.