రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ ఎం. హరిత

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ ఎం. హరిత

బోయినిపల్లి, వెలుగు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. బోయినిపల్లి పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలు, వార్డులను పరిశీలించి, సిబ్బంది హాజరు వివరాలు, రిజిస్టర్, ఫార్మసీ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రతిరోజూ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వైద్యం కోసం ఎందరు వస్తున్నారో తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సిబ్బంది హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అంతకుముందు మండల పరిషత్​ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్​ ప్రక్రియను పరిశీలించారు. 

ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్ల పరిశీలన

వేములవాడ, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, బోయినిపల్లి, చందుర్తి ఎంపీడీవో ఆఫీసుల్లో, రుద్రంగి జీపీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఎంపీడీవో ఆఫీసుల్లో నామినేషన్ల స్వీకరణకు చేసిన హెల్ప్ డెస్క్ లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు పాల్గొన్నారు.