గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టరేట్లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ చేశారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
గద్వాల నియోజకవర్గంలో కొత్తగా 300 మందికి ప్రొసీడింగ్స్ అందించామని, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే మార్కౌట్ కంప్లీట్ చేయాలన్నారు. ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపని 1,197 మంది స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రపోజల్స్ పంపిస్తే ఆమోదిస్తామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీపీవో నాగేంద్రం పాల్గొన్నారు.
