
- ఈనెల 28న మంత్రుల చేతుమీదుగా రేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్
ఆదిలాబాద్, వెలుగు: భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టరేట్ నుంచి బుధవారం అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రెసిడెన్సియల్ స్కూళ్లలో శానిటేషన్, ఆరోగ్య కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్పీడప్ చేయాలని, ఫిట్టింగ్, ప్లాంటేషన్ ప్రక్రియ ఆగస్టు 15 లోగా పూర్తిచేయాలన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరై ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించాలని, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో స్టూడెంట్లకు ఫుడ్, సానిటేషన్, హెల్త్, విద్య, మానసిక వికాసం, తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు చేసి నివేదికలు అందించాలని సూచించారు. ఈ నెల 28న ఆదిలాబాద్, బోథ్ మంత్రుల చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, అన్ని ఏర్పాట్లు చేయాన్నారు.