
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: 15 నుంచి 18 ఏండ్లలోపు బాలికలను ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో చేర్చి రక్షణ, ఆరోగ్యం, విద్య, ఉపాధి తదితర విషయాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్నేహ కార్యక్రమంపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
స్కూళ్లు, కాలేజీల్లో చదివే అమ్మాయిలతో పాటు బడి బయట ఉన్న బాలికలను గుర్తించి స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలన్నారు. గ్రూపుల ఆవశ్యకత, వాటి వల్ల జరిగే లాభాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఏ రవికుమార్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, మెప్మా పీడీ స్వరూపారాణి, డీడబ్ల్యువో సరస్వతి, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు.
స్ట్రీట్ వెండర్లకు తోపుడు బండ్ల పంపిణీ
బధిర విద్యార్థుల్లో ప్రతిభ ఉందని, వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం అక్షయ ఆకృతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ సైన్ లాంగ్వేజీపై మున్సిపల్ ఆఫీస్‌లో నిర్వహించిన రెండో దశ శిక్షణ ముగింపు కార్యక్రమంలో సర్టిఫికెట్లకు ప్రదానం చేశారు. అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, టర్న్ రౌండ్ గ్లోబల్ సర్వీసెస్ ఓనర్ అరవింద్ వెంకట్ సహకారంతో కళాభారతి వద్ద వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు, దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు.