ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి : రాహుల్​ రాజ్​

ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి : రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: జిల్లాలో పార్లమెంట్​ఎన్నికలకు సంబంధించి పొలిటికల్ ​పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎంల మొదటి రాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం ఆయన అడిషనల్ కలెక్టర్ ​వెంకటేశ్వర్లుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను కేటాయించామన్నారు. త్వరలో నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకరూప ధరల పట్టికను ధ్రువీకరించి పొలిటికల్​పార్టీల నాయకులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు, పొలిటికల్​పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఓటు హక్కు ప్రాధాన్యం తెలియజేయాలి

జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ప్రాధాన్యం తెలియజేయాలని కలెక్టర్​ అధికారులకు సూచించారు. 6వ తేదీ నుంచి కళాజాత కార్యక్రమాలు, 5 కే రన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. రాజిరెడ్డి, శ్రీనివాస్, జడ్పీ సీఈవో ఎల్లయ్య , బ్రహ్మాజీ పాల్గొన్నారు. 

ఎన్నికల సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలి..

పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, సిబ్బందికి శిక్షణ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​ సూచించారు. మెదక్​పట్టణంలోని తారకరామానగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్,  నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కాలేజ్​ శిక్షణ కేంద్రాలను పరిశీలించారు. ఈ నెల 4, 6 తేదీల్లో పీవోలు, ఏపీవోలకు  ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. కలెక్టర్​వెంట ఆర్డీవో రమాదేవి, డీఎస్​వో రాజిరెడ్డి, తహసీల్దార్లు శ్రీనివాస్, రజని కుమారి పాల్గొన్నారు.