వరద ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్

వరద ప్రవాహాన్ని  పరిశీలించిన కలెక్టర్

మహాముత్తారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం- మేడారం ప్రధాన రహదారిపై కేశవపూర్ వద్దనున్న పెద్దవాగు, మహాముత్తారం- యామన్ పల్లి మధ్య ఉన్న కోణంపేట అలుగువాగును  మంగళవారం కలెక్టర్​ రాహుల్​ శర్మ పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అటువైపు రాకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ దండు శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆర్అండ్ బీ ఈఈ రమేష్ పాల్గొన్నారు.