- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : హాకీ భారత క్రీడల గౌరవ చిహ్నం అని, క్రమశిక్షణ, దేశభక్తి, సమన్వయ భావనను ప్రతిబింబించే ఆట అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. దేశంలో హాకీ క్రీడ ప్రారంభమై వందేండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ‘హాకీ ఇండియా శతాబ్ది లోగో’ను ఆవిష్కరించి క్రీడాపోటీలను ప్రారంభించారు. యువత క్రీడల్లో పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా హాకీ అభివృద్ధికి కృషి చేసిన సీనియర్ హాకీ క్రీడాకారులను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్, హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఏటీడీవో నిహారిక, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, కోచ్‌లు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
