నల్గొండ జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తాం : అడిషనల్ కలెక్టర్ రాంబాబు

నల్గొండ జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తాం : అడిషనల్ కలెక్టర్ రాంబాబు

కోదాడ, వెలుగు : జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. మంగళవారం కోదాడలోని ఆర్ఎస్ వీ ఫంక్షన్ హాల్ లో గుడిబండలోని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల ప్రొసీడింగ్​కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికీ ఆహార భద్రత కల్పించి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

 సమావేశంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ నాయకులు  తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఇర్ల సీతారాంరెడ్డి, మల్లెల రాణీబ్రహ్మయ్య, నలజాల శ్రీనివాసరావు, కందుల కోటేశ్వరావు, మందలపు శేషు, కొత్త రఘు తదితరులు పాల్గొన్నారు.