 
                                    మహబూబ్ నగర్(నారాయణపేట), వెలుగు: పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలుపై గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహజ, సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించడం, రైతుల ఆదాయం, గ్రామీణ జీవనోపాధి లక్ష్యంగా ప్రణాళికను రూపొందించాలన్నారు. జిల్లాలో ఈ పథకం అమలుకు సంబంధిత శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన అన్ని పారామీటర్లు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. బేస్ లైన్ సర్వేలో పూర్తి వివరాలు నమోదు చేసి, వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.
ఆయా శాఖల పురోగతికి సంబంధించి వార్షిక ప్రణాళికతో పాటు ఐదేళ్ల కోసం ముందస్తు సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, హార్టికల్చర్ శాఖల అధికారులు పూర్తి వివరాలతో సమగ్ర ప్రణాళిక, డాక్యుమెంటరీ, పీపీటీని తయారు చేయాలని ఆదేశించారు. నోడల్ అధికారి సాయిబాబా, డీఆర్డీవో మొగులప్ప, డీఏవో జాన్ సుధాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, నాబార్డ్ జిల్లా మేనేజర్ షణ్ముఖ చారి, ఎల్డీఎం విజయ్ కుమార్, నీటి పారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, డీపీవో సుధాకర్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

 
         
                     
                     
                    