
జనగామ/ రఘునాథపల్లి, వెలుగు : మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆయన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ చేపట్టారు. రెవెన్యూ, పోలీస్, వైద్య, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీ రాజ్శాఖలు అలర్ట్గా ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనంతరం కలెక్టర్ రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. స్టోర్ రూమ్, వంట సామగ్రిని పరిశీలించి, వంట గదిని శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు రఘునాథపల్లిలో ఆగ్రోస్, శ్రీలక్ష్మి ఫర్టిలైజర్ షాపులను వ్యవసాయాధికారి అంబిక సోనితో కలిసి తనిఖీ చేశారు.