
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, వెలుగు: మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, ఏరియా హాస్పిటల్, బస్తీ దవఖానాల్లో వైద్య నిపుణులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని బాలికలకు క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రజిత, డీఆర్డీవో శేషాద్రి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీపీవో షరీఫ్, మెడికల్ సూపరింటెండెంట్లు, పాల్గొన్నారు.