
రాజన్న సిరిసిల్ల, వెలుగు: మహిళల అభ్యున్నతి కోసం 10రోజుల పాటు సంకల్ప్ అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించుకోవాలని రాజన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్బి.గీతేతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు 10 రోజుల పాటు సంకల్ప్ కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలని ఆదేశించారు.
మహిళల రక్షణ చట్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్నారు. మహిళలకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు లీగల్ క్లినిక్ ఏర్పాటు చేయాలన్నారు. రివ్యూ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీఆర్‌డీవో శేషాద్రి, డీఈవో వినోద్ కుమార్, డీపీవో షరీఫుద్దీన్, డీఎంహెచ్‌వో రజిత, సఖి సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.
జీపీవోలుగా ఈనెల 5న పోస్టింగ్‌లు తీసుకోనున్న అభ్యర్థులను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి జీపీవో పరీక్షలో 66 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించామన్నారు.