
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చాలా కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించి కలెక్టర్ మాట్లాడారు. ఇంటర్ నుంచే ప్రతి సబ్జెక్టు పరిధి పెరుగుతుందని, అన్ని సబ్జెక్టులపై విద్యార్థులు పట్టుపెంచుకోవాలన్నారు. ఈసందర్భంగా కాలేజీలో సమస్యలను విద్యార్థులు, లెక్చరర్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సబేరా బేగం, డీఐఈవో శ్రీనివాస్, తహసీల్దార్ సుజాత, ప్రిన్సిపాల్ పద్మావతి పాల్గొన్నారు.
మల్యాల జూనియర్ కాలేజీలో..
మల్యాల, వెలుగు: మల్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందుతోందని ప్రిన్సిపాల్ మోతే శివరామకృష్ణ అన్నారు. శుక్రవారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను సరస్వతీదేవికి దీపాలంకరణతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పేరెంట్స్ తమ పిల్లలు ప్రతిరోజు కాలేజీకి వచ్చేలా చూడాలన్నారు.
మంథని,వెలుగు: మంథనిలోని ప్రభుత్వ జూనియర్ గర్ల్స్, బాయ్స్ జూనియర్ కాలేజీల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం కాలేజీలో విద్యార్థులు సాధించిన ప్రగతి నివేదికను తల్లిదండ్రులకు వివరించారు. కాలేజీల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టం అమలుచేస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను రెగ్యులర్ గా కాలేజీకి పంపిస్తే ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు.
చందుర్తి, వెలుగు: ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని చందుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం చందుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిల్లలు ఫోన్లకు దూరం ఉండేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.