
రాజన్న సిరిసిల్ల, వెలుగు: స్వస్త్ నారీ, సశక్త్‌పరివార్ అభియాన్‌లో భాగంగా ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ప్రతి ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ పరిధిలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
హెల్త్ క్యాంప్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లు హాజరయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా జిల్లాలో 99 క్యాంపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రజిత, ప్రోగ్రాం ఆఫీసర్లు, అధికారులు పాల్గొన్నారు