మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో సెర్ప్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళ శక్తి స్వయం సహాయ సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా 2248 మహిళా సంఘాల సభ్యుల గ్రూపులకు 2.25 కోట్ల విలువైన చెక్కును అందించారు. 

వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో 4,724 సంఘాలకు రూ.5.10 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వడ్డీ లేని రుణాలతో మహిళలు వ్యాపారాలు చేసుకుంటూ కోటీశ్వరులుగా మారాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు. పాఠశాలలను రూ.10 కోట్ల  నిధులతో రిపేర్లు చేయించామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ  శ్రీనివాసులు, డీపీఎం సులోమి, అరుణ పాల్గొన్నారు.