
- నాగర్ కర్నూల్ జిల్లాలో ఫర్టిలైజర్ షాపు తనిఖీ చేసిన కలెక్టర్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఫెర్టిలైజర్ షాపును కలెక్టర్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు, రైతులకు విక్రయిస్తున్న తీరును, రిజిస్టర్ నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మోసపూరితంగా విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో విత్తనాల సరఫరా, నాణ్యత, నియంత్రణ కోసం ప్రమాణాలు, ధరల పట్టికలు పరిశీలించారు.
కచ్చితంగా ఈ పాస్ ద్వారానే విక్రయించాలని, ఎమ్మార్పీ ధరకే ఎరువులను విక్రయించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల గ్రామస్థాయిల్లో ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీలు, నిరంతరం నిఘాతో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. రైతులకు ఏమైనా సందేహాలుంటే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.