గద్వాల జిల్లాలో స్టూడెంట్ ను అభినందించిన కలెక్టర్ సంతోష్

గద్వాల జిల్లాలో స్టూడెంట్ ను  అభినందించిన కలెక్టర్ సంతోష్

 గద్వాల టౌన్, వెలుగు : రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించిన స్టూడెంట్ ను కలెక్టర్ సంతోష్ అభినందించారు. టీ షాట్, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెచ్ఎంల సంఘం ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి విద్యార్థలు పాల్గొన్నారు. 

గద్వాల జిల్లా మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన విద్యార్థి కేశవర్ధన్ పాల్గొని ప్రతిభ కనబర్చి ఫస్ట్ ప్రైజ్ కైవసం చేసుకున్నాడు. శుక్రవారం కలెక్టరేట్​లో స్టూడెంట్ ను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నరేశ్, గౌడ్ టీచర్ అనిత తదితరులు ఉన్నారు.