గద్వాల, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లకు ఆదేశించారు. గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగే గద్వాల మండలం వీరాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
గ్రామపంచాయతీ ఆఫీస్లో కూడా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తుండడంతో ఓటర్లకు తగిన సదుపాయాలు కల్పించాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. మొత్తం ఓటర్ల సంఖ్య, ఇతర వివరాలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. అనంతరం ఎర్రవల్లి మండల కేంద్రంలో పదో బెటాలియన్లో ఉన్న జడ్పీ హైస్కూల్లో బిల్డింగ్లో క్లస్టర్–1, 2 నామినేషన్ల సెంటర్లను పరిశీలించారు.
