ఇండ్లు కట్టుకోకుంటే ఇతరులను ఎంపిక చేయండి : కలెక్టర్ సంతోష్

ఇండ్లు కట్టుకోకుంటే ఇతరులను ఎంపిక చేయండి :  కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన ఇతరులను ఎంపిక చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఇండ్ల పనుల పురోగతిపై ఎంపీడీవోలు, హౌసింగ్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో కొత్త లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 6,200 మందికి ఇండ్ల ప్రొసీడింగ్స్​ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీపీవో నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.

కొత్త మెనూ చార్ట్ ఆవిష్కరణ

2025-–26 విద్యాసంవత్సరానికి గానూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రీ మెట్రిక్ హాస్టల్లో కొత్త మెనూ చార్ట్ ను కలెక్టర్ గురువారం తన చాంబర్ లో ఆవిష్కరించారు. ఈ ఏడాది కొత్త పోషకాహార మెనూ అమలులోకి వచ్చిందన్నారు. బీసీ సంక్షేమ అధికారి అక్బర్ బాషా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత తదితరులున్నారు.