అలంపూర్,వెలుగు: అలంపూర్ దేవాలయాల వంటి మన సంస్కృతి–శిల్ప వైభవాన్ని ప్రతిబింబించే ఈ అమూల్య ఆలయ వారసత్వాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు.బుధవారం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు సందర్భంగా అలంపూర్ లోని కుడవల్లి సంగమేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ వారం కార్యక్రమం మానవ నాగరికతకు మూలాధారమైన విలువలను సంరక్షించే సమిష్టి బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. నవంబర్ 19 నుండి 25 వరకు జరిగే ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం ప్రజల్లో చారిత్రక అవగాహన పెంపొందించడం,వారసత్వ స్థలాల గురించి తెలుసుకునే అవకాశం కల్పించడం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఎన్. నిహిల్ దాస్,డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ హెచ్.ఆర్. దేశాయి ,అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ రోహిణి పాండే,డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజికల్ ఇంజినీర్ కృష్ణ చైతన్య,అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజికల్ ఇంజినీర్ పి. కిషోర్ కుమార్ రెడ్డి ,అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయి కృష్ణ, కన్జర్వేషన్ అసిస్టెంట్, అలంపూర్ దేవాలయాలు యు. వెంకటయ్య,తహసీల్దార్ మంజుల, మాంటిస్సోరి విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.
