 
                                    గద్వాల, వెలుగు: నర్సింగ్ కాలేజీ ఓపెనింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో నర్సింగ్ కాలేజీతో పాటు మెడికల్ కాలేజీ హాస్టల్ పనులు, ఇతర అంశాలపై రివ్యూ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ లో మంత్రి దామోదర రాజనర్సింహ నర్సింగ్ కాలేజీ బిల్డింగ్, వసతి గృహ బిల్డింగ్ ను ఓపెన్ చేయనున్నారని తెలిపారు.
రూ.130 కోట్లతో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీ హాస్టల్ కు శంకుస్థాపన చేస్తారన్నారు. హాస్టల్లో వసతులు కల్పించేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపించాలన్నారు. టీజీఎంఎస్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్, డిప్యూటీ ఈఈ శ్రీనివాసులు, ఏఈ రహీం, మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కవిత, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ హనుమంతమ్మ, సూపరింటెండెంట్ ఇందిర పాల్గొన్నారు.

 
         
                     
                     
                    