
గద్వాల, వెలుగు: జిల్లాలో లిక్కర్ షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 34 లిక్కర్ షాపుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అందులో ఎస్సీలకు 6, గౌడ కులస్తులకు 5 షాపులు కేటాయిస్తామన్నారు. గద్వాల మున్సిపాలిటీ లిక్కర్ షాప్ 4, 8, అయిజ మున్సిపాలిటీ షాప్ నెంబర్ 3, మల్దకల్ గ్రామం షాప్ నంబర్-2, ఎర్రవల్లి గ్రామం షాప్ నంబర్ 1 గౌడ కులస్తులకు కేటాయించామని చెప్పారు.
గద్వాల మున్సిపాలిటీ షాప్ నెంబర్ 7 అయిజ మున్సిపాలిటీ షాప్ నెంబర్ 1, 2, మల్దకల్ షాప్ నెంబర్ 1, వడ్డేపల్లి షాప్ నెంబర్ 2, మానవపాడు షాప్ నెంబర్ 2 ఎస్సీలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా 23 షాపులు ఓపెన్ క్యాటగిరీగా ఉంటాయన్నారు. లిక్కర్ షాపుల యాక్షన్ లో పాల్గొనేవారు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 18 వరకు ఎక్సైజ్ ఆఫీసులో దరఖాస్తులతో పాటు
రూ.3 లక్షల డీడీని అందజేయాలన్నారు. లిక్కర్ షాపు మంజూరైన వారు డిసెంబర్ 1 నుంచి షాప్ లను ప్రారంభించుకోవాల్సి ఉంటుందన్నారు. గద్వాల నియోజకవర్గానికి 21, అలంపూర్ నియోజకవర్గానికి 13 చొప్పున లిక్కర్ షాపులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ విజయభాస్కర్ రెడ్డి, సీఐ గణపతి రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ఆఫీసర్ నుశిత ఉన్నారు.
పోటీలో లేని పార్టీల తొలగింపు
జోగులాంబ గద్వాల జిల్లాలో పోటీలో లేని రాజకీయ పార్టీలను రిజిస్టర్ జాబితా నుంచి తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్టు కలెక్టర్ సంతోష్ తెలిపారు. జై మహాభారత్ పార్టీ ఆరేళ్లుగా ఎన్నికలలో పోటీ చేయకపోవడంతో ప్రజాపాతినిధ్య చట్టం సెక్షన్ 20ఎ ప్రకారం ఆ పార్టీని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తమ అభ్యంతరాలను ఈనెల 29 లోపు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారికి సమర్పించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్చేయాలి
గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆఫీసర్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన మండలాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెరిగేవిధంగా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఇంద్ర మహిళ సాధనలో ఆఫీసర్లు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, గృహ నిర్మాణ శాఖ డీఈ కాశీనాథ్, డీపీవో నాగేంద్రం, ఎల్డీఎం శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్ ఉన్నారు.