
గద్వాల, వెలుగు: నార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం గట్టు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరునుపై పేషెంట్లను ఆరా తీశారు. గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, హైరిస్క్ కండీషన్ ఉన్న వారిని ముందుగానే గుర్తించి, మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్ సూర్యప్రకాశ్‌కు సూచించారు.
‘పది’లో 100 శాతం ఫలితాలు సాధించాలి
పదోతరగతిలో 100 శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం గట్టు మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. క్లాస్ రూమ్స్, కిచెన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. చదువులో వెనకబడిన విద్యార్థులను ఆయా సబ్జెక్టుల టీచర్లు గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఫేషియల్ రికగ్నైజేషన్ వ్యవస్థను ప్రతీరోజు వినియోగించాలని సూచించారు. ఎంపీడీవో చెన్నయ్య తదితరులు ఉన్నారు.