
మహబూబ్నగర్(నారాయణ పేట), వెలుగు: అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చని కలెక్టర్సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులకు, ఎంఎల్ హెచ్ పీలకు సీపీఆర్ పై వేర్వేరుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంఐసీయూ డాక్టర్ రఘు రెడ్డి సీపీఆర్చేసే విధానంపై అవగాహన కల్పించారు. డాక్టర్ జయచంద్ర మోహన్, ప్రోగ్రాం ఆఫీసర్సత్యప్రకాశ్, ఎన్ సీడీ కోఆర్డినేటర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.