కొనుగోళ్లను వేగవంతం చేయండి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

కొనుగోళ్లను వేగవంతం చేయండి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

బోధన్, వెలుగు : కేంద్రాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని బండార్ పల్లి లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని, కల్దుర్కిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ పరిశీలించి మాట్లాడారు. సోయాబీన్ ఎంత మేరకు కొనుగోలు చేశారంటూ ఆరా తీశారు.  రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. 

ప్రతి కేంద్రంలో సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. కల్దుర్కి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైస్ మిల్లులకు ఎన్ని లోడ్ ల లారీలు వెళ్లాయి, ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా అని ఆరా తీశారు. ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు రికార్డులను పరిశీలించారు. 17 శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని తూకం వేయాలన్నారు.  ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, మార్క్ ఫెడ్ డీ.ఎం మహేశ్, బోధన్ తహసీల్దార్ విఠల్,  కల్దుర్కి సొసైటీ చైర్మన్ శరత్ ఉన్నారు.