నాణ్యమైన ఉత్పత్తులు త‌‌యారు చేయాలి : కలెక్టర్ తేజ‌‌స్ నందలాల్ పవార్

నాణ్యమైన ఉత్పత్తులు త‌‌యారు చేయాలి : కలెక్టర్ తేజ‌‌స్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : నాణ్యమైన ఉత్పత్తుల త‌‌యారీకి జిల్లా చిరునామాగా నిలవాలని, అందుకు కావాల్సిన అన్ని వ‌‌స‌‌తులు స‌‌మ‌‌కూర్చేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తేజ‌‌స్ నందలాల్ పవార్ తెలిపారు. మంగ‌‌ళ‌‌వారం సూర్యాపేట‌‌లోని బాలాజీ  గ్రాండ్ హోట‌‌ల్లో జ‌‌రిగిన బ్యూరో ఆఫ్ ఇండియ‌‌న్ స్టాండ‌‌ర్డ్స్ మాన‌‌క్ మ‌‌హోత్సవానికి క‌‌లెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఐఎస్ రూపొందించే ప్రమాణాలు ప్రతిఒక్కరి జీవితంలో కీల‌‌క‌‌పాత్ర పోషిస్తున్నాయ‌‌న్నారు. జిల్లాలో పరిశ్రమ‌‌ల‌‌ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్నిర‌‌కాల స‌‌హ‌‌కారాలు అందిస్తున్నామ‌‌న్నారు. నాణ్యత అంటే ఖ‌‌ర్చు కాద‌‌నే విష‌‌యాన్ని గుర్తుపెట్టుకోవాల‌‌ని సూచించారు.

అనంత‌‌రం బీఐఎస్ డైరెక్టర్‌‌, శాస్త్రవేత్త పీవీ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ నాణ్యతా ప్రమాణాల‌‌ను చేరువ చేయాల‌‌నే ల‌‌క్ష్యంతోనే బీఐఎస్ దేశ‌‌మంత‌‌టా విస్తరిస్తుందన్నారు. వినియోగ‌‌దారుడు వ‌‌స్తువుల నాణ్యత‌‌పై అవ‌‌గాహ‌‌న క‌‌లిగి ఉండాలని సూచించారు. బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వ‌‌స్తువుల నాణ్యత‌‌, బంగారు ఆభ‌‌ర‌‌ణాల శుద్ధత‌‌ను క్షణాల్లో తెలుసుకోవ‌‌చ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఐసీ జీఎం సీతారాం, పౌర‌‌స‌‌ర‌‌ఫ‌‌రాలశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, బీఐఎస్ ఎస్‌‌వో వ‌‌న‌‌జామూర్తి, సిమెంటు, పీవీసీ పైపుల త‌‌యారీదారులు, సిబ్బంది పాల్గొన్నారు.