
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
హుజూర్ నగర్, వెలుగు : కాలేజీ స్థాయిలోనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. శుక్రవారం హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. బీహార్ నుంచి వచ్చిన కూలీల చిన్న పిల్లలను చూసి వారిని అంగన్వాడీ సెంటర్ లో చేర్పించాలని ఐసీడీఎస్సిబ్బందిని ఆదేశించారు.
క్లాస్రూమ్లోకి వెళ్లి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టును ఇంటర్ సెకండియర్విద్యార్థులకు బోధించారు. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను పరిశీలించి, ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. రోగులు అందుతున్న వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మేళ్లచెరువు, వెలుగు : మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. క్లాసులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.