చిన్నచిన్న వృత్తి వ్యాపారాల ద్వారా..మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిన్నచిన్న వృత్తి వ్యాపారాల ద్వారా..మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : చిన్నచిన్న వృత్తి వ్యాపారాల ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం నల్గొండ లోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల ఏర్పాటుపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకులు చేయూతనిస్తాయని తెలిపారు. 

ఆత్మస్థైర్యంతో పెట్టుబడి పెట్టి సమాజంలో వ్యాపారవేత్తలుగా ఎదగాలని చెప్పారు. సమాజంలో చాలా మంది ముందుగా చిన్నగా వ్యాపారాలు మొదలుపెట్టి ప్రస్తుతం కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని తెలిపారు. గొప్ప వ్యాపార వేత్తలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్​చార్జి అడిషనల్ కలెక్టర్ నారాయణ్ అమిత్, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు,  అధికారులు పాల్గొన్నారు. 

భోజన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

హాలియా, వెలుగు : విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం గుర్రంపోడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.