
- కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోందని, అర్హత గల ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు గ్రామైక్య సంఘాల వీవోలు, ఏపీఎం, కమ్యూనిటీ సమన్వయకర్తలకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికాభివృద్ధి కోసం ఇందిరా మహిళా శక్తి పథకం కింద అనేక వ్యాపారాలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఇతర ఎంటర్ప్రైజెస్ల
నిర్వహణకు తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని, అర్హత కలిగిన ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు తదితరులు పాల్గొన్నారు.