మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు ఫోకస్ చేయాలని పాలమూరు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్టార్ట్ చేయని వారిని గుర్తించి, వాటిని రద్దు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లోకల్ ఎమ్మెల్యేలతో చర్చించి కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
జిల్లా అధికారులు తమకు కేటాయించిన హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలను ప్రతి నెలా మొదటివారంలో తనిఖీ చేసి యాప్లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సెంటర్లలో సౌలతులు కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.
