మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో అబ్జర్వర్ కాత్యాయని దేవి సమక్షంలో దేవరకద్ర, చిన్న చింతకుంట, కౌకుంట్ల, కోయిల్ కొండ, మిడ్జిల్, హన్వాడ మండలాలకు సంబంధించిన రెండవ దశ ర్యాండమైజేషన్ నిర్వహించారు.
రెండవ దశ ఎన్నికలు జరిగే మండలాల్లోని 151 గ్రామపంచాయతీలు,1,334 వార్డులకు 1,601 మంది పీవోలు, 1,902 మంది ఓపీవోలను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.
