
- ఉదండాపూర్నిర్వాసితులకు 300 గజాల స్థలం కేటాయించాలి
- కలెక్టర్విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు పునరావాస పనులు స్పీడప్చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, మిషన్ భగీరథ, ఇతర అధికారులతో రివ్యూ చేశారు. రిజర్వాయర్ కింద ఇండ్లు కోల్పోయినవారికి పునరావాసం కింద 300 గజాల స్థలం కేటాయించాలన్నారు.
పునరావాస కాలనీలో ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవనం, పార్కు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఓవర్ హెడ్ ట్యాంక్, మిషన్ భగీరథ పైపుల వంటి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఎ.నరసింహారెడ్డి, ఆర్డీవో నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో ఆర్థికంగా ఎదగాలి
లాభాలు అందించే ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. భూత్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేస్తున్న ఆయిల్ పామ్తోటలను మంగళవారం ఆమె పరిశీలించారు.ప్రభుత్వం ప్రతీ ఎకరాకు మొక్కల కొనుగోలుకు రూ.11 వేలు, డ్రిప్ సిస్టం ఏర్పాటుకు రూ.21 వేలు, మెయింటెనెన్స్ కోసం రూ.16,800 సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ.. జిల్లాలో 4,298 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్నట్లు తెలిపారు. ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ పామ్ కంపెనీ జోనల్ మేనేజర్ రాకేశ్, జిల్లా ఏరియా మేనేజర్ బాలరాజ్, సిబ్బంది ఉన్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేదిక, వీఐపీలు, అధికారులు, మీడియా, ఇతరులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయా శాఖలు సాధించిన ప్రగతిని తెలుపుతూ శకటాలు ప్రదర్శించాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఏనుగు నర్సింహారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, డీఈవో ప్రవీణ్ కుమార్, డీఎఫ్వో సత్య నారాయణ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం, డీఎస్వో శ్రీనివాస్ తదితరులున్నారు.