వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు రిపేర్లు కంప్లీట్ చేయండి : కలెక్టర్ విజయేందిర బోయి

వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు రిపేర్లు కంప్లీట్ చేయండి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, ప్రభుత్వ భవనాలను గుర్తించి వెంటనే రిపేర్లు  చేయాలని కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా గుంతలు పడిన రోడ్లను  గుర్తించి వెంటనే ప్యాచ్  వర్క్  చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అంగన్​వాడీ కేంద్రాలు, ప్రభుత్వ భవనాలకు అవసరమైన రిపేర్లు చేయించేందుకు ఎస్టిమేషన్​లు పంపించాలన్నారు. 

ఎస్డీఆర్ఎఫ్  నిబంధనలు, మార్గదర్శకాల  ప్రకారం రిపేర్లు చేయాలని సూచించారు. అడిషనల్  కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, డీఎంహెచ్​వో కృష్ణ, డీఈవో ప్రవీణ్ కుమార్, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం, జిల్లా వెటర్నరీ అధికారి మధుసూదన్ గౌడ్, డీపీవో పార్థసారథి, డీఏవో వెంకటేశ్  పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు, భూభారతిలో వచ్చిన అప్లికేషన్లను పెండింగ్ లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మూసాపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.