లోతట్టు ప్రాంతాల ముంపుపై అలర్ట్ గా ఉండండి : కలెక్టర్ విజయేందిర బోయి

లోతట్టు ప్రాంతాల ముంపుపై అలర్ట్ గా ఉండండి : కలెక్టర్ విజయేందిర బోయి
  • ఆఫీసర్లకు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాలు 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  వర్షాల వల్ల లోతట్లు ప్రాంతాలు జలమయమై ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలలోని  షాషాబ్ గుట్ట ఏరియా లో వర్షపు నీటి కాల్వలను, పెద్ద చెరువును, సమీప ప్రాంతాలను  మునిసిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.

 నగరపాలక సంస్థ పరిధిలో  వర్షాల వలన వర్షపు నీరు నిలిచి లోతట్టు  ప్రాంతాలు జలమయం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షపు  నీటి కాల్వ మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ వెంట అడిషనల్  కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, నగర పాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈ ఈ విజయ్ భాస్కర్ రెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఈ ఈ మనోహర్ తదితరులు ఉన్నారు.